సూర్యలంక బీచ్ వద్ద తుఫాన్ బీభత్సం

సూర్యలంక బీచ్ వద్ద తుఫాన్ బీభత్సం

బాపట్ల: జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం సూర్యలంక బీచ్ వద్ద మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. బీచ్ తీరం వెంబడి గంటకు 90 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. తీవ్రత కారణంగా తీర ప్రాంతంలో ఉన్న పలు విద్యుత్ స్తంభాలు పూర్తిగా విరిగిపోయాయి. అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు.