VIDEO: గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమం

జోగులాంబ గద్వాల: వడ్డేపల్లి మండలం జూలేకల్ గ్రామంలో మల్టీపర్పస్ వర్కర్లు బుధవారం డ్రైనేజీ కాలువలను శుభ్రం చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నిరంతరం కృషి చేస్తామని వారు తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. కార్మికులు ప్రతిరోజూ శుభ్రం చేయడం వల్ల తమకు ఎలాంటి రోగాలు రావడం లేదని పేర్కొన్నారు.