చిన్న వడ్డేపల్లి చెరువు సందర్శించిన కలెక్టర్, సీపీ

చిన్న వడ్డేపల్లి చెరువు సందర్శించిన కలెక్టర్, సీపీ

WGL: వరంగల్ నగరంలోని దేశాయిపేట చిన్న వడ్డేపల్లి చెరువు ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవితో పాటు సీపీ సన్ ప్రీత్ సింగ్ గురువారం సందర్శించారు. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చిన్న వడ్డేపల్లి చెరువు ప్రమాదకరంగా మారడంతో అధికారులు స్పందించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బందికి వివరించారు.