VIDEO: అయ్యప్ప దీక్ష విద్యార్థిని కొట్టలేదు: ప్రిన్సిపల్ ఫాతిమా
SRPT: అయ్యప్ప మాల ధరించి పాఠశాలకు వచ్చిన విద్యార్థి మహేష్‌ను కొట్టారన్న ఆరోపణలను సూర్యాపేట ఏవీఎం స్కూల్ ప్రిన్సిపల్ ఫాతిమా ఖండించారు. ఈ ఘటనపై ఆమె ఇవాళ వివరణ ఇచ్చారు. క్రమశిక్షణలో భాగంగానే విద్యార్థిని మందలించడం జరిగిందే తప్ప, కొట్టారన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. అన్ని మతాలు, కులాలను తాము గౌరవిస్తామని పేర్కొన్నారు.