వెండి కవచం విశేష అలంకరణలో మురడి ఆంజనేయుడు
ATP: రాయదుర్గం నియోజకవర్గం డి హిరేహాల్ మండలం మురిడి గ్రామంలో వెలసిన ప్రసిద్ధ ఆంజనేయుడు సోమవారం వెండి కవచ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చాడు. ఉదయాన్నే స్వామివారికి సుప్రభాత సేవ పంచామృతం, వివిధ అభిషేకాలు చేపట్టి వెండి కవచంతో ప్రత్యేకంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.