VIDEO: డైమండ్ బాబును అడ్డుకున్న పోలీసులు
GNTR: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు కోర్టులో గురువారం లొంగిపోతున్న నేపథ్యంలో, వారికి సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న తాడికొండ వైసీపీ సమన్వయకర్త డైమండ్ బాబును పోలీసులు అడ్డుకున్నారు. మేడికొండూరు మండలం కొర్రపాడు వద్ద ఈ ఘటన జరిగింది. సంఘీభావం తెలపడానికి వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.