పారుదల వ్యవస్థల మెరుగుదలపై ఎమ్మెల్యే సమీక్ష
BPT: నియోజకవర్గంలో సాగు, మురుగునీటి పారుదల వ్యవస్థల ప్రక్షాళన ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు తెలిపారు. శుక్రవారం బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాల్వల శుభ్రత, నీటి పారుదల మెరుగుపరచాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.