VIDEO: చెత్త కుప్పలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహం
ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో ఇందిరమ్మ విగ్రహాన్ని చెత్త కుప్పల్లో ఉంచడంపై మండల నాయకుడు దీక్షిత్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ రాజ్యం అంటున్నా, ఆమె విగ్రహానికి కనీసం మండల కేంద్రంలో స్థలాన్ని కేటాయించి ఏర్పాటు చేయలేకపోవడం దారుణమన్నారు. ఇది కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు.