పెందుర్తి అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్
AP: విశాఖ పెందుర్తిలో మహిళ అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. అత్తను కోడలు హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆట పేరుతో అత్తను కోడలు తాళ్లతో బంధించి.. ఆ తర్వాత పెట్రోల్ పోసి దీపం విసిరి నిప్పంటించింది. అనంతరం అగ్నిప్రమాదం జరిగిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.