VIDEO: ప్రకాశం జిల్లాలో వింత ఆచారం.!
ప్రకాశం జిల్లాలో గురువారం వింత ఘటన చోటుచేసుకుంది. యర్రగొండపాలెం మండలం కొలుకుల గ్రామంలో గంగురాజు, నందినిల వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకలో వారి కుటుంబ సభ్యుల ఆచారం మేరకు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెగా ముస్తాబై ఊరేగింపుగా వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అయితే ఇది వారి కుటుంబ సభ్యుల ఆచారం అని తెలిపారు.