రహదారిపై కూలిన చెట్టు.. రాకపోకలకు అంతరాయం

KDP: బుధవారం తెల్లవారుజామున ఈదురు గాలులతో కూడిన వర్షానికి రహదారిపై చెట్టు కూలింది. మండలంలోని బ్రాహ్మణపల్లి ప్రధాన రహదారిపై చెట్టు కూలడంతో రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. దీని ప్రభావం వల్ల ఒంటిమిట్ట సిద్ధపటం మండలం వాసులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. సంబంధిత అధికారులు తక్షణమే చెట్టు తొలగించాలని పరిసర ప్రజలు కోరుతున్నారు.