యూరియా బస్తాల పంపిణీని పరిశీలించిన ఎస్పీ

MHBD: నెల్లికుదురు మండలంలోని శ్రీరామగిరి సొసైటీలో జరుగుతున్న యూరియా బస్తాల పంపిణీని జిల్లా ఎస్పీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల సంక్షేమానికి పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఎస్పీ హామీ ఇచ్చారు. ఎవరైనా మోసం చేస్తే లేదా అధిక ధరలకు విక్రయిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.