పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు జూలపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చీమల పేటలో రూ.20 లక్షలు, తేలు కుంటలో రూ.55 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనం, మహిళా సంఘ భవనం, హెల్త్ సెంటర్‌లకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.