VIDEO: ఫోన్ ట్యాపింగ్ CBIకి అప్పగించాలని అర్థనగ్న ప్రదర్శన

HYD: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ నేడు సిట్ ఎదుట హాజరయ్యారు. ఈ నేపథ్యంలో దిల్ కుషా గెస్ట్ హౌజ్ వద్ద బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలని అర్థనగ్న ప్రదర్శన చేశారు. కొంతమంది బీజేపీ కార్యకర్తలు షేమ్ కేటీఆర్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.