గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
MBNR: రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామంలో పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన బీజేష్ కుమార్ గంజాయి విక్రయిస్తున్నాడని సమాచారం అందడంతో ఎక్సైజ్ పోలీసులు గురువారం అతన్ని అరెస్టు చేశారు. స్థానిక కంపెనీలో సూపర్వైజర్‌గా పనిచేస్తున్న అతను బీహార్ నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. అతనిపై 12 కేసులు ఉన్నట్లు సీఐ విప్లవ్ రెడ్డి తెలిపారు.