ఆక్రమణకు గురైన భూమి స్వాధీనం
NLR: ASపేట మండలంలోని హసనాపురంలో ఉన్న పీర్ల మాన్యం స్థలాన్ని జిల్లా వర్ఫ్ బోర్డ్ ఇన్స్‌ఫెక్టర్ షేక్ ఖూదావన్ పరిశీలించి స్వాధీన పరుచుకున్నారు. 11.5 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్టు ఫిర్యాదులు రావడంతో శుక్రవారం ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం వాటికి హద్దులు ఏర్పాటు చేసి ఎవరైనా లీజ్‌కు అడిగితే వేలం ద్వారా ఇవ్వవాలని దర్గా ఈవోకు సూచించారు.