అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: ఎమ్మెల్సీ

KDP: బద్వేల్ నియోజకవర్గంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నష్టపోయిన పలు పంటలకు నష్టపరిహారం అందించాలని ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి చేతికి వచ్చిన పంట నేల పాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారని ఆయన అన్నారు. వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.