‘ఆత్మాహుతి బాంబు ఇస్తే పాక్‌పై పోరాటానికి సిద్ధమే’

పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కర్ణాటక మంత్రి బీజడ్ జమీర్ అహ్మద్ తీవ్రంగా స్పందించారు. తనకు ఓ ఆత్మాహుతి బాంబు ఇస్తే పాకిస్తాన్‌పై పోరాటానికి సిద్ధమేనని జమీర్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందుకు అనుమతించాలని కోరారు. అంతేకాకుండా, పాక్ ఎప్పటికీ భారత్‌కు శత్రు దేశమేనని విమర్శించారు.