గుడ్లవల్లేరు రెండు స్క్రబ్ టైఫస్ కేసులు
కృష్ణా: గుడివాడ డివిజన్ పరిధిలోని గుడ్లవల్లేరు PHCలో ఇద్దరు మహిళలకు స్క్రబ్ టైఫస్ ఉన్నట్లు డా. యశస్విని తెలిపారు. పామర్రుకు చెందిన అమలేశ్వరి, గుడ్లవల్లేరుకు చెందిన మానస శుక్రవారం చికిత్స కోసం రాగా, వారి రక్త నమూనాలను పరీక్షించగా పాజిటివ్ నిర్ధారణ అయిందన్నారు. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. కాగా, రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే.