GVMC టౌన్ ప్లానింగ్ అధికారులతో మేయర్ సమీక్ష

VSP: GVMC టౌన్ ప్లానింగ్‌పై ప్రజలకు మంచి అభిప్రాయం కలిగేలా విధులు నిర్వహించాలని మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం GVMC కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. GVMC ఖాళీస్థలాలను గుర్తించి ఆక్రమణకు గురికాకుండా 15 రోజుల్లో హద్దు రాళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్లాన్ మంజూరుకు తప్పుడు పత్రాలు సమర్పిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.