గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్‌కు భూ సేకరణ
RR: ఫ్యూచర్ సిటీ మీదుగా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్‌కు భూమిని సేకరించనున్నారు. ఈ మేరకు 67ఎకరాల 12 గుంటలకు ప్రతిపాదనలు ఉన్నట్లు రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం నిన్న ఒక ప్రకటనలో తెలిపింది. గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రహదారి కోసం సాకిబండ తండాలోని 67.12 ఎకరాల భూములు సేకరిస్తున్నామని అధికారులు వివరించారు.