నేడు సంస్కృత వర్సిటీ స్నాతకోత్సవం

TPT: జాతీయ సంస్కృత వర్సిటీ నాలుగో స్నాతకోత్సవం స్థానిక మహతి కళాక్షేత్రంలో గురువారం నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వీసీ ఆచార్య జి.ఎస్.ఆర్. కృష్ణమూర్తి తెలిపారు. 75 మంది విద్యార్థులు విద్యావారధి పీహెచ్ పట్టాలు, 564 మంది పట్టభద్రులుగా పత్రాలు అందుకోనున్నారు. చాన్సలర్ ఎం.గోపాలస్వామి, పూర్వ ఛాన్సలర్ బి.ఆర్.పంచముఖి పాల్గొంటున్నట్లు వెల్లడించారు.