VIDEO: మహబూబాబాద్‌లో ఆర్టీసీ సమ్మె.. బస్సులు బంద్

VIDEO: మహబూబాబాద్‌లో ఆర్టీసీ సమ్మె.. బస్సులు బంద్

మహబూబాబాద్ పట్టణంలో ఆర్టీసీ డిపోలో అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీ జేఏసీ నాయకులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చర్చలు విఫలమవడంతో కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో 75 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. బుధవారం డిపో ఎదుట కార్మికులు నిరసనకు దిగగా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.