రామాయంపేటలో యూరియా కోసం రాస్తారోకో

రామాయంపేటలో యూరియా కోసం రాస్తారోకో

MDK: రామాయంపేట మండల కేంద్రంలో రైతులతో కలిసి బీజేపీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు మెదక్ రామయంపేట రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే రైతులకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.