'నదీ పరివాహక ప్రాంతంలోకి వెళ్లవద్దు'

'నదీ పరివాహక ప్రాంతంలోకి వెళ్లవద్దు'

MNCL: కడెం ప్రాజెక్టు వరద గేట్ల నుంచి నీళ్లను వదలడంతో పాటు వర్షాల వల్ల వరద వస్తున్న నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీళ్లు కిందకు వదిలే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి చేపలు పట్టే వారు, గొర్రె కాపరులు, రైతులు నదీ పరివాహక ప్రాంతంలోకి వెళ్లవద్దని సూచించారు. అలాగే పశువులు, గొర్రెలు వెళ్లకుండా చూడాలని కోరారు.