పగిడ్యాలలో నీటి కోసం విద్యార్థుల ఇక్కట్లు
NDL: పగిడ్యాలలోని ఏపీ మోడల్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు నీటి కోసం అవస్థలు పడుతున్నామంటున్నారు. భోజనం అనంతరం ప్లేట్లు కడుక్కోవడానికి పాఠశాలలో నీళ్లు లేక కేసీ కెనాల్ గట్ల మీద నిలబడి కడుక్కోవాల్సి వస్తుందన్నారు. పిల్లలు కాలువ వద్దకు వెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. దీనిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.