డిసెంబర్ 10నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం

డిసెంబర్ 10నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం

KKD: టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ (టెట్) డిసెంబర్ 10న ప్రారంభం కానుంది. జిల్లాలో సూరంపాలెం ఆదిత్య కళాశాలలో, కాకినాడ అచ్యుతాపురం, రాయుడుపాలెం కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. జిల్లావ్యాప్తంగా 9,600 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఒక సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరో సెషన్లో పరీక్షలు జరగనున్నాయి.