భూసార పరీక్షలతో సాగు ఖర్చు తగ్గించుకోవచ్చు

భూసార పరీక్షలతో సాగు ఖర్చు తగ్గించుకోవచ్చు

ప్రకాశం: కనిగిరి మండలం పోలవరంలో బుధవారం ఏడిఏ ఈవి రమణ, ఏవో జోష్ణ దేవిలు మట్టి నమూనాల సేకరణ పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భూసార పరీక్షల వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా ఎరువులను వాడటం వలన సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చని రైతులకు సూచించారు. మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు చేయించుకోవాలన్నారు.