'నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలి'

ప్రకాశం: జిల్లాలో 10వ తరగతి విద్యార్హత ఉన్నవారు కనీసం 10 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు కృషి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఈ మేరకు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులకు ఉల్లాస్ అక్షర ఆంధ్ర అక్షరాస్యత శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 15 నుంచి 59 సంవత్సరాలవారిని అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యమన్నారు.