'పారిశుద్ధ సిబ్బంది జాగ్రత్తలు పాటించాలి'

PDPL: వర్షాకాలంలో పారిశుద్ధ్య సిబ్బంది అనారోగ్యానికి గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని రామగుండం మున్సిపల్ కమిషనర్ జె.అరుణ శ్రీ సూచించారు. సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో సిబ్బందికి మన్నికైన రెయిన్ కోట్లు పంపిణీ చేశారు. వ్యక్తిగత రక్షణ కిట్లు, రెయిన్ కోట్లు తప్పనిసరిగా ఉపయోగించాలని, వర్షాల్లోనూ పారిశుద్ధ్య పనులు జాగ్రత్తగా నిర్వహించాలన్నారు.