ట్రిపుల్ ఐటీలో లెక్చరర్‌పై దాడి

ELR: నూజివీడు ట్రిపుల్ ఐటీలో స్టూడెంట్ లెక్చరర్‌పై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎగ్జామ్ హాల్లోకి అనుమతించలేదన్న కోపంతో విద్యార్థి వినయ్, ఫ్యాకల్టీ గోపాల్‌రాజుపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అధ్యాపకుడిని ఆసుపత్రికి తరలించారు. దాడి అనంతరం విద్యార్థి హాస్టల్‌కి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.