ప్రజలు బయటికి రావద్దు: డీఎస్పీ
KDP: దిత్వా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని DSP వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, కరెంటు స్తంభాలు, నీటి ప్రవాహాల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. ఏ ఆపద వచ్చినా డయల్ 112 లేదా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.