రైతుల సమస్యలు మంత్రి నాదెండ్లకు విన్నవించండి: MLA
NLR: నియోజకవర్గంలో రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అన్నారు. ఇంకేమైనా సమస్యలు ఉంటే రేపు ఇనమడుగుకు మంత్రి నాదెండ్ల మనోహర్ వస్తున్నారని ఆయన దృష్టికి తీసుకురావాలని సూచించారు. రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా స్వయంగా పరిశీలించాలని నాదెండ్లను ఆదేశించినట్లు ఆమె తెలిపారు.