దేవాలయ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

HYD: రాజేంద్రనగర్ సర్కిల్, మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ కాలనీలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో ప్రతీరోజూ వివిధ ఆరోగ్యకరమైన మరియు ఉల్లాసమైన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రతి ఉదయం సూర్య నమస్కారాలు, కర్రసాము, అలాగే వివిధ ఉల్లాస ఆటలు నిర్వహిస్తున్నారు.