కన్హా గ్రామసర్పంచ్‌తో సహా 8 వార్డులు ఏకగ్రీవం

కన్హా గ్రామసర్పంచ్‌తో సహా 8 వార్డులు ఏకగ్రీవం

RR: షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండల పరిధిలోని కన్హా గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో జరిగిన పరిశీలనలో సర్పంచ్ పదవితో పాటు మొత్తం ఎనిమిది వార్డ్ సభ్యుల స్థానాలు ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ప్రకటించారు. గ్రామ సర్పంచ్‌గా మధుసూదన్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారన్నారు.