'మార్కెటింగ్, కోతుల, కూలీల ఇబ్బందులు లేవు'

SRCL: మార్కెటింగ్, కోతులు, కూలీల ఇబ్బందులు లేని ఆయిల్ పామ్ పంట సాగు విస్తీర్ణం జిల్లాలో క్రమంగా పెరుగుతున్నది. పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీలు, మద్దతు అందిస్తూ భరోసా ఇస్తున్నది. అంతర పంటల సాగుతో రైతులకు అదనపు ఆదాయం సమకూరుతున్నది. జిల్లాలోని పలు మండలాల్లో పంట చేతికి రావడంతో రైతుల్లో మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతున్నదని తెలిపారు.