గడ్డి మిషన్‌లో ఇరుక్కుని యువకుడి చెయ్యి కట్

గడ్డి మిషన్‌లో ఇరుక్కుని యువకుడి చెయ్యి కట్

PLD: కారంపూడి మండలం చిన్నగార్లపాడులో గురువారం ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ డ్రైవర్ వెంకటేష్ (22) వరిగడ్డి కట్టే మిషన్‌లో ఇరుక్కున్న దారాన్ని తీస్తుండగా ప్రమాదవశాత్తు చేయి లోపలికి వెళ్లింది. ఇంజిన్ ఆన్‌లో ఉండటంతో అతడి చెయ్యి సగానికి పైగా తెగిపోయింది. వెంటనే స్థానికులు అతడిని పిడుగురాళ్లకు, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించారు.