పరువు హత్య కేసు .. సీఐ సస్పెండ్..!

పరువు హత్య కేసు .. సీఐ సస్పెండ్..!

పల్నాడు: మాచర్ల పట్టణ సీఐ వెంకటరమణపై సస్పెన్షన్ వేటు పడింది. చౌడేశ్వరి తల్లిదండ్రుల వద్ద డబ్బులు తీసుకుని ఆమెను బలవంతంగా అప్పగించి  పరువు హత్యకు కారణమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. చౌడేశ్వరి పరువు హత్యలో తల్లిదండ్రులతో పాటు వెంకటరమణ హస్తం ఉందని తేలడంతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. సీఐని సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.