మీ కళాత్మక బోధనా శైలి అభినందనీయం మాస్టారు: లోకేష్
AP: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడిని మంత్రి లోకేష్ అభినందించారు. 'బల్లెడ అప్పలరాజు మాస్టారు మీ కళాత్మక బోధనా శైలి చూడ ముచ్చటగా ఉంది. బోటనీ సబ్జెక్టు బోధిస్తూనే.. సహ ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారంతో ల్యాబ్‌ను ఆకర్షణీయంగా, విజ్ఞానవంతంగా.. సైన్స్, మోరల్ వేల్యూస్, జనరల్ నాలెడ్జ్ ప్రతిబింబించేలా ఉంది' అని 'X'లో కొనియాడారు.