ఈనెల 26న జరిగే మహా ధర్నా ఆవిష్కరణ
KNR: ఈనెల 26న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ టీఆర్పీ జిల్లా కార్యాలయంలో ఆదివారం పోస్టర్ను ఆవిష్కరించారు. కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు గంగిపెల్లి అరుణ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ఈ ధర్నాలో తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.