ఉప్పుగుండూరులో CPM నేతల నిరసన

ప్రకాశం: నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామ సబ్ స్టేషన్ వద్ద CPM నేతలు సోమవారం నిరసన ధర్నాను నిర్వహించారు. స్మార్ట్ మీటర్లు బిగించిన తర్వాత అధికంగా వచ్చిన కరెంటు బిల్లులను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. స్మార్ట్ మీటర్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి శ్రీకాంత్, జిల్లా కమిటీ సభ్యులు జయంతి బాబు తదితరులు పాల్గొన్నారు.