ముగ్గురు పిల్లలతో తల్లి ఆత్మహత్యాయత్నం
KDP: నంద్యాల జిల్లా సంజాముల మండలం పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ, కుటుంబ సమస్యల కారణంగా తన ముగ్గురు పిల్లలతో కలిసి బుధవారం మైలవరం జలాశయం కట్టపై ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ సమాచారంతో పోలీసులు సకాలంలో స్పందించి వారిని కాపాడారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి, మహిళ భర్తను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.