వేసవి తాపం పెరుగుతుండటంతో కల్లుకు డిమాండ్

వేసవి తాపం పెరుగుతుండటంతో కల్లుకు డిమాండ్

BHNG: వేసవి తాపం పెరుగుతుండటంతో ఉమ్మడి నలగొండ జిల్లాలో కల్లుకు గిరాకీ పెరిగింది. శరీరానికి చలవ చేయడంతో పాటు విటమిన్లు, ఖనిజాలు ఉండే కల్లును జనం పోషక ఆహారంగా భావిస్తారు. ఉమ్మడి జిల్లాలోని 65 లక్షల చెట్ల ఆధారంగా వేలాది మంది గౌడన్నలు ఉపాధి పొందుతున్నారు. స్వచ్చమైన కల్లుకు డిమాండ్ పెరగడంతో గీత కార్మికులకు ఆదాయం పెరిగింది.