'ఉపాధి హామీ పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలి'

'ఉపాధి హామీ పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలి'

NRML: కడెం మండలంలోని పెద్దూరు గ్రామ పంచాయితీ పరిధిలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో భాగంగా బుధవారం కుంటలో పూడిక తీత పనులను పెద్దూరు గ్రామ సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ కడెం ఏపీవో జయదేవ్ ఉన్నారు.