ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి!

ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి!

ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. బీజాపూర్ జిల్లాలోని తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో మావోలను భద్రతా బలగాలు చుట్టు ముట్టినట్లు సమాచారం. ఘటనా స్థలంలో పెద్ద సంఖ్యలో ఆయుధాలను ఆర్మీ స్వాధీనం చేసుకుంది.