అన్నదాన భవన నిర్మాణానికి విరాళం అందజేత
W.G: కాళ్ల మండలం కాళ్లకూరులోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో అన్నదాన భవన నిర్మాణానికి ఇవాళ ఏలూరుపాడు వాస్తవ్యులు శ్రీ పడమట సుబ్బయ్య లక్ష్మీలావణ్య దంపతులు రూ.1,11,111 లక్షల విరాళం అందించారు. దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు శ్రీ అడ్డాల శివరామరాజు, కార్యనిర్వహణాధికారి ఈ విరాళాన్ని స్వీకరించారు. అనంతరం వారికి స్వామివారి శేష వస్త్రం, ప్రసాదాలు, వేద ఆశీర్వచనం అందజేశారు.