'నూతనంగా 108 పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదన'
కోనసీమ: జిల్లాలో 108 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె అమలాపురంలో జిల్లా కలెక్టరేట్ వద్ద శనివారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 1200 ఓటర్లు పైబడి ఉన్నచోట నూతన పోలింగ్ కేంద్రాన్ని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు.