VIDEO: ఆకివీడులో రామాలయ నిర్మాణ పనులు ప్రారంభం
WG: ఆకివీడు పెదపేటలోని రామాలయ నిర్మాణ పనులు ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. శిథిలావస్థకు చేరిన పాత ఆలయాన్ని తొలగించి, జేసీబీలతో మట్టిని క్లియర్ చేశారు. శాస్త్రోక్తంగా పురోహితులు పూజలు చేశారు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. పోలీసుల పటిష్ఠ బందోబస్తు మధ్య ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.