VIDEO: నాగులవంచ- రామాపురంకు రాకపోకలు నిలిపివేత

VIDEO: నాగులవంచ- రామాపురంకు రాకపోకలు నిలిపివేత

KMM: బోనకల్ మండలం నాగులవంచ సమీపంలోని బండిరేవువాగు వంతెనపై మంగళవారం ఉదయం పోలీసులు రాకపోకలను నిలిపివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో వంతెన పైనుంచి బండి రేవు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ముందు జాగ్రత్తగా ట్రాక్టర్‌ను అడ్డు పెట్టి రాకపోకలను నిలిపివేయడం జరిగింది. దీంతో నాగులవంచ- రామాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే వాగు వద్దకు ఎవరిని అనుమతించడం లేదు.