ఎన్నికలను సజావుగా నిర్వహించాలి: కలెక్టర్
VKB: స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో సర్పంచ్ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల స్వీకరణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 8416235291 హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని, 24/7 పనిచేస్తుందని పేర్కొన్నారు.